గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్షల హాల్‌టిక్కెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. అభ్యర్ధులు psc.ap.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎపిపిఎస్‌సి కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 8వ తేదిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రెండు పూటలా ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి 12 గంటలకు పేపర్‌ా1, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్-2 నిర్వహించనుంది.