చిత్తూరు: జిల్లా ఆసుపత్రల్లో ఖాళీల భర్తీకి సర్కార్​ ఉత్తర్వులు

By udayam on December 28th / 10:17 am IST

ఏపీ వైద్యారోగ్య శాఖ జిల్లా ఆసుపత్రిలోని పలు ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, సెక్యూరిటీ గార్డు తదితర 53 ఖాళీలను భర్తీ చేసేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పలు పోస్టులకు కనీస అర్హత ఐదో తరగతి మాత్రమే. మిగతా పోస్టులకు సంబంధిత అంశంలో డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్.. అర్హతలుగా నిర్ణయించింది. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్​