ఇప్పటం గ్రామస్థులకు షాక్ ఇచ్చిన హైకోర్టు

By udayam on November 24th / 10:23 am IST

ఇప్పటం గ్రామస్థులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్ట్ ను తప్పుపట్టించారంటూ 14 మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధించింది. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తమకు నోటీసులు ఇవ్వలేదని రైతుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాము నోటీసులు ఇచ్చిన తరువాతనే కూల్చేశామని ఇటీవల విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. దీంతో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 14 మంది రైతులకు కోర్ట్​ జరిమానా విధించింది.

ట్యాగ్స్​