పరిషత్​ ఎన్నికలకు గ్రీన్​సిగ్నల్​

By udayam on April 7th / 10:21 am IST

ఆంధ్రప్రదేశ్​లో ఈనెల 8న జరగనున్న మండల పరిషత్​, జిల్లా పరిషత్​ ఎన్నికలకు అడ్డంకులు తొలగి పోయాయి. ఈ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు నిబంధనల్ని పాటించలేదంటూ మంగళవారం హైకోర్టు సింగిల్​ బెంచ్​ ఇచ్చిన ఉత్తర్వుల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు అప్పీల్​ చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు సింగిల్​ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ రేపటి ఎన్నికలు యధావిధిగా జరుపుకోవచ్చని చెప్పారు. అయితే ఫలితాలను మాత్రం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆపాలని సూచించింది.

ట్యాగ్స్​