రాష్ట్రంలో అంగన్ వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయట్లేదంటూ.. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ గతంలో కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పోస్టుల భర్తీపై గతంలో స్టే విధించింది. తాజాగా ఆ స్టేను ఎత్తివేస్తూ నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 560 అంగన్వాడీ సూపర్‌వైజర్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు మొదలెట్టింది.