హైకోర్ట్​ : రుషికొండ త్వకాలపై మేమే కమిటీ వేస్తాం

By udayam on December 21st / 12:28 pm IST

విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాల అంశంపై తామే స్వయంగా ఓ కమిటీని నియమించనున్నట్లు ఎపి హైకోర్ట్​ వ్యాఖ్యానించింది. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టులో ఈరోజు జరిగిన విచారణలో.. అక్రమ తవ్వకాలపై నిగ్గు తేల్చేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం వేసిన కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించించడం పై పిటిషనర్ల తరపు న్యాయవాదుల అభ్యంతరాలను పట్టించుకోలేదని కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్టుగా కనిపిస్తోందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ట్యాగ్స్​