రైతుల రుణ భారంలో దేశంలోనే ఏపీ అగ్ర స్థానంలో ఉంది. ప్రతి రైతు కుటుంబంపై తలసరి రుణ భారం రూ. 2,45,554 అప్పు ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజ్యసభలో ప్రకటించారు. జాతీయ స్థాయిలో తలసరి అప్పు రూ. 74,121 ఉందని చెప్పారు. రెండు, మూడు స్థానాల్లో కేరళ, పంజాబ్ ఉండగా… రూ. 1,52,113 తలసరి అప్పుతో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని వెల్లడించారు. జాతీయ సగటు కంటే ఏపీ అప్పు మూడు రెట్లు, తెలంగాణ అప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.