ఏపీ: ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​ పరీక్ష ఫీజు షెడ్యూల్​ ఇదే

By udayam on December 16th / 5:05 am IST

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థుల పరీక్షల ఫీజు షెడ్యూల్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు విడుదల చేసింది. మార్చిలో జరగనున్న పరీక్షలకు జనవరి 7వ తేదీలోపు ఎలాంటి అపరాధ రుసుమూ లేకుండా ఫీజు చెల్లించవచ్చని బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు తెలిపారు. రూ.120 అపరాధ రుసుముతో జనవరి 10వ తేదీ వరకు, రూ.500 రుసుముతో 12వ తేదీ వరకు, రూ.1000 రుసుముతో 17వ తేదీ వరకు, రూ.2 వేలతో 20వ తేదీ వరకు, రూ.3వేలతో 23 వరకు, రూ.5వేలతో 25వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించారు.

ట్యాగ్స్​