ఎపిలో 175 మొబైల్​ వెటర్నరీ అంబులెన్స్​లు

By udayam on May 19th / 10:38 am IST

పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల ఇంటి వద్దకే వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో డా.వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ పథకానికి ఎపి సిఎం జగన్​ మోహన్​ రెడ్డి ఈరోజు శ్రీకారం చుట్టారు. అనారోగ్యానికి గురైన పాడి పశువుల చికిత్స కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1962 కు కాల్ చేసి అంబులెన్స్ సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు. తొలిదశలో రూ.143 కోట్ల వ్యయంతో 175 అంబులెన్సులను నేడు జగన్​ ప్రారంభించారు. రెండో దశలో రూ.135 కోట్లతో మరో 165 వాహనాలను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్​