ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేయాల్సిందేనని, లేకుంటే ఉత్తరాంధ్రను నూతన రాష్ట్రంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర పూర్తిగా వెనకబడి పోయిందని, ఇలాగే కొనసాగితే మరింత కాలం ఒకచోటకే నిధులు మళ్లించే అవకాశాలున్నాయని ఆయన ఆవేదన చెందారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ నిధులన్నీ హైదరాబాద్ కే తరలించడం కారణంగా మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు.