కూతురిపై ట్రోలింగ్​.. కంటతడి పెట్టుకున్న రోజా

By udayam on December 28th / 5:21 am IST

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సోషల్​ మీడియా ట్రోలింగ్​ తో కన్నీటి పర్యంతమయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈ టాలీవుడ్​ సీనియర్​ యాక్ట్రెస్​ తో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా ఈ మధ్య కొందరు కావాలని సోషల్​ మీడియాలో ట్రోల్​ చేస్తున్నారు. దీనిపైనే ఆమె స్పందిస్తూ.. ‘నా కూతురు అన్షు మాలిక చాలా సెన్సిటివ్​. అలాంటి పిల్లను కూడా ట్రోల్​ చేస్తున్నారు. ఆమె ఇది తట్టుకోలేక నన్ను నిలదీస్తోంది. మనకు ఇది అవసరమా? అంటూ నన్ను ప్రశ్నిస్తోంది’ అంటూ రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​