మున్సిపల్‌ ఎన్నికలకు ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

By udayam on February 21st / 6:16 am IST

అమరావతి : మార్చిలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నామినేషన్‌ వేసి మృతి చెందిన అభ్యర్థుల స్థానంలో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

వివిధ పార్టీల అభ్యర్థులు 56 మంది మృతి చెందినట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్‌ దాఖలుకు గడువుగా పేర్కొంది.

అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గత సోమవారం షెడ్యూల్‌ రిలీజ్ చేసింది.

షెడ్యూల్‌ ప్రకారం మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు. మార్చి 8వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగుస్తుంది.

మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు. అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్‌ నిర్వహించి మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది.

ట్యాగ్స్​