ఏపీలో మండల కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

By udayam on December 19th / 10:11 am IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంచాయితీ రాజ్‌ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మండల కో ఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అవుట్ సోర్సింగ్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుందని వివరించింది. దరఖాస్తులకు ఈ నెల 20(మంగళవారం) చివరి తేదీగా ప్రకటనలో పేర్కొంది.

ట్యాగ్స్​