ఏలూరు: దీక్ష భగ్నం చేసి జోగయ్యను ఆసుపత్రికి పంపిన పోలీసులు

By udayam on January 2nd / 6:22 am IST

కాపు రిజర్వేషన్ల సాధన కోసం పాలకొల్లులో నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించిన మాజీమంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్యను గత రాత్రి పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.రాత్రి దాదాపు 11 గంటల సమయంలో జోగయ్య ఇంటికి చేరుకున్న సుమారు 400 మంది పోలీసుల భద్రత మధ్య జోగయ్యను అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్సులోకి ఎక్కించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీక్ష కోసం ఆయన నివాసం వద్ద ఉదయం నుంచీ ఏర్పాట్లు జరిగాయి.

ట్యాగ్స్​