ఏపీలో బాగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

By udayam on January 9th / 5:57 am IST

దేశం వ్యాప్తంగా కోల్డ్‌వేవ్‌ ప్రభావం కనిపిస్తోంది. చలి దెబ్బకు తెలుగు రాష్ట్రాలు గజగజలాడిపోతున్నాయి. ఏపీలోనూ చలి పంజా విసురుతోంది.మొదటిసారిగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మునుపెన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరో 3 రోజులు ఇదే తీవ్రతతో పరిస్థితి కొనసాగవచ్చని, చిన్నపిల్లలు.. వృద్ధులు.. శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఆంధ్రా కాశ్మీర్‌గా పేరుగాంచిన లంబసింగిలో ఆదివారం ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల కనిష్ట స్థాయిలో నమోదైంది. సీలేరులో 7 డిగ్రీలుగానూ.. ఉంది.

ట్యాగ్స్​