ఎపికి అదానీ గ్రీన్​ ఎనర్జీ విద్యుత్​ ప్లాంట్లు

By udayam on May 24th / 3:16 am IST

ఎపిలో రెండు భారీ ప్రాజెక్టులు నిర్మించడానికి అదానీ గ్రీన్​ ఎనర్జీ ముందుకొచ్చింది. దావోస్​ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్దిక ఫోరమ్​ సదస్సులో ఎపి సిఎం జగన్​, అదానీ గ్రూప్​ సంస్థల ఛైర్మన్​ గౌతమ్​ అదానీల మధ్య ఈ మేరకు ఎంఓయూ కుదిరింది. ఇందులో భాగంగా ఎపిలో 3,700 మెగావాట్ల పంప్డ్​ హైడ్రో స్టోరేజ్​ ప్లాంట్​తో పాటు 10000ల మెగా వాట్ల సోలార్​ విద్యుత్​ ప్రాజెక్ట్​ నిర్మాణానికి అదానీ ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్​ల కోసం రూ.60 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు.

ట్యాగ్స్​