ఎపి టెన్త్ పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం విడుదల కానున్నాయి. రేపు 11 గంటలకు ఈ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ విజయవాడలో విడుదల చేయనున్నారు. 2019 తర్వాత రెండేళ్ళ విరామం అనంతరం ఈ ఏడాదే టెన్త్ ఫైనల్ పరీక్షలు జరిపారు. ఈ సారి 6,21,799 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అయ్యారు. అయితే ఈ ఏడాది ఫలితాలలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఫలితాలను గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో ఇవ్వనున్నట్లు పేర్కొంది.