విద్యార్ధి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎపిలోని స్టూడెంట్ యూనియన్స్ ఈరోజు విజయవాడలోని రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. సమస్యల పరిష్కారంతో పాటు ఖాళీ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఛలో రాజ్ భవన్‌కు సిద్ధమయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాజ్‌భవన్ రోడ్డులో ఆంక్షలు పెట్టారు. రాజ్‌భవన్ పరిసరాల్లో సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా ప్రకటించారు.