ఏపీ: నేడు ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా ప్రకటన

By udayam on December 26th / 9:08 am IST

బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల్లో సీనియార్టీ జాబితాను పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించనుంది. ఈ నెల 14 నుంచి 20 వరకు జరిగిన దరఖాస్తు ప్రక్రియలో 80 వేల మంది ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకునే ప్రక్రియ మంగళవారం నుంచి జనవరి 1 వరకు 6 రోజుల పాటు జరగనుంది. అయితే, షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన బదిలీ దరఖాస్తుల ప్రక్రియను మూడు రోజులు పొడిగించిన విద్యాశాఖ దానికి తగ్గట్టుగా అభ్యంతరాలు తెలియచేయడానికి గడువు ఇవ్వలేదు. దీంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ట్యాగ్స్​