ఉపాధ్యాయ బదిలీల్లో అసంబద్ధాల కారణంగా ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. బదిలీల నిమిత్తం విడుదల చేసిన 187,190 జివోలలో ఇచ్చిన మార్గదర్శకాలు అర్హులైన సీనియర్లకు నష్టం చేకూర్చేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పాటు 117 జివో ప్రకారం రేషనలైజేషన్ చేయడంతో అనేక ప్రైమరీ, యుపి స్కూల్స్ సిబ్బంది కూడా నష్టపోయేవీలుంది. ఉపాధ్యాయులు కష్టపడి విద్యార్థుల సంఖ్య పెంచినా.. రేషనలైజేషన్ వల్ల వారు కూడా నష్టపోవాల్సివస్తోంది.