టీచర్ల బదిలీలకు సంబంధించిన తుది జాబితాను తాము ఆదేశాలు జారీ చేసే వరకూ వెల్లడించరాదని పాఠశాల విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది. ప్రాథమిక సీనియారిటీ జాబితాపై టీచర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే విషయానికే పరిమితం కావాలని జస్టిస్ జి.రామకష్ణ ప్రసాద్ సోమవారం ఆదేశించారు. కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. విచారణను జనవరి 4కి వాయిదా వేసింది.టీచర్ల బదిలీలకు ఆ శాఖ జారీ చేసిన జీవో 187 సజావుగా లేదని, బదిలీలకు ఎంపిక చేసిన గైడ్‌లైన్స్ సక్రమంగా లేవని తెలిపింది.