కేంద్రం: బీహార్​ కంటే ఏపీలోనే మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువ

By udayam on December 21st / 5:32 am IST

ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీలో మహిళలపై దాడుల అంశంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం లోక్ సభలో నేడు జవాబిచ్చింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కేసుల్లో ఏపీదే అగ్రస్థానమని తెలిపింది. మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ కంటే ఏపీలోనే అత్యధిక కేసులు చోటుచేసుకుంటున్నాయని కేంద్రం వివరించింది. 2018తో పోల్చితే దేశంలో అత్యాచారాలు, దాడులు పెరిగాయని వెల్లడించింది.

ట్యాగ్స్​