పాపులర్ మ్యూజిక్ గాడ్జెట్ ఐపోడ్‌ను ఇకపై తయారు చేయబోమని యాపిల్ సంస్థ సంచలన ప్రకటన చేసింది. 20 ఏళ్ళ క్రితం తొలిసారిగా విడుదలైన ఈ గాడ్జెట్ ఎందరో సంగీత ప్రియులకు మోస్ట్ వాంటెడ్ గాడ్జెట్‌గా మారింది. 2001 అక్టోబర్ 23న తీసుకొచ్చిన ఈ ఎంపి3 ప్లేయర్ అప్పట్లోనే 1000 సాంగ్స్‌ను, 10 గంటల బ్యాటరీ లైఫ్‌తో పనిచేసేది. అనంతరం 2004లో ఐపోడ్ మినిని ఆ సంస్థ ప్రవేశపెట్టింది. 2006లో ఐపోడ్ నాన్ రాగా, 2007లో ఐపోడ్ టచ్ ను తీసుకొచ్చింది.