ముందు ముందు రోజుల్లో షాపింగ్ కోసం పాస్వర్డ్ అవసరం లేకుండానే లాగిన్ అయ్యే సదుపాయాన్ని టెక్ దిగ్గజాలు తీసుకురాన్నాయి. ఇందుకోసం దిగ్గజ టెక్నాలజీ కంపెనీలైనా యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు చేతులు కలిపాయి. ఫాస్ట్ ఐడెంటిఫై ఆన్లైన్ (ఎఫ్‌డిఐ), వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం సంస్థలతో కలిసి సరికొత్త టెక్నాలజీని ఆ కంపెనీలు రూపొందిస్తున్నాయి. దీంతో పాటు పాస్‌వర్డ్‌కు బదులు బయోమెట్రిక్ తీసుకురావాలని మరిన్ని కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.