ఐఫోన్ ప్రియులకు ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్ ఇచ్చింది. ఐఫోన్ లేటెస్ట్ మోడల్ 14 సిరీస్ స్టార్టింగ్ మోడల్ పై ఏకంగా రూ.29,310 ల డిస్కౌంట్ ను ప్రకటించింది. దీంతో ఈ మొబైల్ అన్ని ఆఫర్లు పోనూ కేవలం రూ.50,590 కే అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 13 కంటే ఐఫోన్ 14 మోడల్ కు మార్కెట్లో డిమాండ్ అంతగా లేకపోవడంతో కొత్త సంవత్సరం కానుకగా ఈ ఆఫర్లు ప్రకటించింది. దీంతో పాటు ఎం1 చిప్ తో మాక్ బుక్ ఎయిర్ పైనా భారీ డిస్కౌంట్ ను ఇచ్చి.. దాని ధరను రూ.61,990 కి తగ్గించింది.