యాపిల్​ నుంచి ఫోల్డబుల్​ ఐఫోన్

ప్రొటోటైప్​ సిద్ధం చేస్తున్న టెక్నాలజీ దిగ్గజం

2022లో అందుబాటులోకి వచ్చే అవకాశం

By udayam on November 18th / 12:45 pm IST

టెక్నాలజీ దిగ్గజం యాపిల్​ తన వినియోగదారులకు మరో సరికొత్త ఐఫోన్​ మోడల్​ను తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఎల్​జి, షియోమి, మోటోరోలా, సామ్​సంగ్​ వంటి కంపెనీలు విడుదల చేసిన ఫోల్డబుల్​ ఫోన్లకు ధీటుగా ఓ సరికొత్త మడతపెట్టే ఐఫోన్​ను తీసుకొచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

అయితే ఇది పూర్తిగా మడతపెట్టే సామ్​సంగ్​ ఫోల్డ్​ ఫోన్​లా కాకుండా ఎల్​జి జి8 ఎక్స్​ థింక్యూ మోడల్​ను పోలి ఉండేలా రెండు స్క్రీన్లతో ప్లాన్​ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రొటోటైప్​ కోసం యాపిల్​ ఆర్డర్​ చేసినట్లు చైనాకు చెందిన ఎకనామిక్​ డైలీ వార్తా సంస్థ వెల్లడించింది.

ఇందుకు కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్​ ఇవ్వాలంటూ ఐఫోన్​ తయారీదారు ఫాక్స్​కాన్​తో యాపిల్​ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు ఎకనామిక్​ డైలీ వెల్లడించింది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ 2022 సెప్టెంబర్​ నాటికి సిద్ధం చేసి వినియోగదారులకు అందించడానికి యాపిల్​ ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించింది.