2025లో యాపిల్​ సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్​

By udayam on November 19th / 5:14 am IST

యాపిల్​ సంస్థ తీసుకురానున్న ఎలక్ట్రిక్​ కారు 2025లో మార్కెట్​లోకి వస్తుందని తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ ఎలక్ట్రిక్​ కారు పూర్తిగా సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్​గా ఉంటుందని ఈ నివేదికలు చెబుతున్నాయి. బ్లూమ్​బర్గ్​ సంస్థ రాసిన ఈ కథనం ప్రకారం ఈ కార్​ కోసం యాపిల్​ ఓ ప్రత్యేక మైన చిప్​ను అభివృద్ధి చేస్తోందని పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న టెస్లా సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్​ కంటే మరింత మెరుగైన అనుభూతిని అందించడానికి యాపిల్​ ప్రయత్నిస్తోందని పేర్కొంది.

ట్యాగ్స్​