యాపిల్ భారత్ లోని తన ఐఫోన్ యూజర్లకు ఈరోజు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 5జి ఇంటర్నెట్ ను తమ ఫోన్లలో వాడుకునేలా సాఫ్ట్ వేర్ ను అప్డేట్ చేసింది. డిసెంబర్ 13 రాత్రి 11:30 గంటలకు జియో , ఎయిర్‌టెల్ కనెక్షన్‌లను వినియోగిస్తున్న ఐఫోన్ వినియోగదారులకు 5జీ అప్‌డేట్ అందజేసినట్లు యాపిల్ స్పష్టం చేసింది. ఐఓఎస్ 16.2 రిలీజ్ కావడంతో.. భారతదేశంలోని వినియోగదారులు కవరేజీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్ స్పీడ్‌ను ఉపయోగించుకోగలుగుతారు. 2020 లేదా తర్వాత విడుదలైన అన్ని ఐఫోన్ 5G ఫోన్లలో ఇప్పుడు ఈ సపోర్ట్ యాక్టివేట్ అవుతుంది.