టాప్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ యాపిల్ చైనాలోని తన ప్రొడక్షన్ ప్లాంట్లను మూసేయాలని భావిస్తున్నట్లు నిక్కీ ఆసియా రిపోర్ట్ వెల్లడించింది. ఆ దేశం అనుసరిస్తున్న జీరో కొవిడ్ నిబంధనలతో వస్తున్న ఆకస్మిక లాక్డౌన్లతో పాటు మరిన్ని విధానాల వల్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పేర్కొంది. దీంతో యాపిల్ తన ప్రొడక్షన్‌ను ఆసియాలోని వేరే దేశాలైన వియత్నాం, ఇండోనేషియా, ఇండియాలకు షిప్ట్ చేయాలని భావిస్తున్నట్లు ఈ రిపోర్ట్‌లో పేర్కొంది.