ఫుట్​ బాల్​ క్లబ్​ పై కన్నేసిన యాపిల్​

By udayam on November 25th / 5:12 am IST

యూరోపియన్​ ఫుట్​ బాల్​ క్లబ్​ మాంచెస్టర్​ యునైటెడ్​ ను కొనుగోలు చేయడానికి దిగ్గజ స్మార్ట్​ ఫోన్​ బ్రాండ్​ యాపిల్​ ప్లాన్స్​ వేస్తోంది. 3.7 బిలియన్​ పౌండ్ల విలువైన ఈ క్లబ్​ కోసం 5.8 బిలియన్​ పౌండ్లు ఆఫర్​ చేస్తోంది యాపిల్​. ఈ డీల్​ ఓకే అయితే మెన్​ ఇన్​ రెడ్​ క్లబ్​ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్లబ్​ గా అవతరించనుంది. ఈ క్లబ్​ ను ఇటీవలే దాని యజమానులైన ‘ది గ్లేజర్స్​ ఫ్యామిలీ’ అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటించింది. పోర్చుగల్​ ఫుట్​ బాల్​ ప్లేయర్​ క్రిస్టియానో రొనాల్డో ఈ క్లబ్​ ను వీడుతున్నట్లు ప్రకటించిన వెంటనే దీనిని అమ్మేయాలని యజమానులు భావిస్తున్నారు.

ట్యాగ్స్​