రష్యా మారణహోమం జరుపుతున్న ఉక్రెయిన్‌కు మొదటి నుంచీ అండగా ఉన్న అమెరికా తాజాగా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ దేశ రాజధాని క్యీవ్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటించనున్నారని తెలుస్తోంది. గతంలో ఆయన ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలాండ్‌లో పర్యటించి అక్కడి ఉక్రెయిన్ వలసదారులతో మాట్లాడిన విషయం తెలిసిందే. మే 5 నుంచి 9 వరకూ రొమేనియా, స్లోవేకియాల్లో బైడెన్ భార్య జిల్ బైడెన్ పర్యటన ఖరారైన వెంటనే బైడెన్ పర్యటనపై వార్తలు వస్తున్నాయి.