గ్రూప్‌-2 పరీక్షలో ఇకపై రెండు పేపర్లే

By udayam on January 7th / 7:30 am IST

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూపు-2 పరీక్షల విధానంలో రాష్ట్రప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం స్క్రీనింగ్‌, ప్రధాన పరీక్ష కలిపి 600 మార్కులకు నిర్వహిస్తున్న విధానాన్ని 450 మార్కులకు తీసుకొచ్చింది. మూడు పేపర్లకు నిర్వహిస్తున్న ప్రధాన పరీక్షకు అదనంగా సిలబస్‌ను కలిపి రెండు పేపర్లకే పరిమితం చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి శుక్రవారం విడుదల చేశారు. ప్రస్తుతం స్క్రీనింగ్‌ పరీక్షను ఒక పేపర్‌లో 150 మార్కులకు, ప్రధాన పరీక్షను మూడు పేపర్లలో 450 మార్కులకు నిర్వహిస్తోంది. ఒక్కొ పేపర్‌ 150 మార్కుల చొప్పున 300 మార్కులకు పరీక్షను నిర్వహించనుంది.

ట్యాగ్స్​