ఆర్టీసీ: మైలేజీ లేకపోతే జీతం నుంచే కట్​

By udayam on May 16th / 6:11 am IST

బస్సు మైలేజీలు ఎందుకు రావడం లేదో వివరణ ఇవ్వాలంటూ ఎపిఎస్​ఆర్టీసీ డ్రైవర్లకు తాఖీదులు ఇస్తోందని ఈనాడు రిపోర్ట్​ చేసింది. అనకాపల్లి డిపోకు చెందిన కొందరు డ్రైవర్లకు ఇలా తాఖీదులు అందినట్లు పేర్కొంది. ఒక డ్రైవర్​ లీటరుకు 6 కి.మీ.ల మైలేజీకి బదులు 5.16 కి.మీ.లే మైలేజీ చూపించారని దీంతో అదనంగా వాడిన 115 లీ.డీజిల్​కు రూ.12,075 నష్టం వచ్చినట్లు తాఖీదుల్లో పేర్కొన్నారు. ఇలా అధికంగా వాడినందుకు జీతం నుంచి ఎందుకు ఆ మొత్తాన్ని కట్​ చేయకూడదో వివరణ ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్​