ఎపిఎస్‌ఆర్‌టిసి సంక్రాంతి పండుగకు రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. తిరుగు ప్రయాణంతో సంబంధం లేకుండా కేవలం ఈ నెల 6 నుండి 14 వరకు ఆర్‌టిసి రూ.141 కోట్ల ఆదాయాన్ని పొందింది. సంక్రాంతికి ముందు రోజుల్లో సాధారణ ఛార్జీలతోనే 3,120 బస్సులను నడపాలని తొలుత ఆర్‌టిసి నిర్ణయించింది. అయితే టిఎస్‌ఆర్‌టిసి, ప్రైవేట్ ఆపరేటర్ల అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ఆర్‌టిసి బస్సులకు రద్దీ పెరిగింది. దీంతో ఆర్‌టిసి ముందు నిర్ణయించిన 3,120 బస్సులకు కంటే అధికంగా 3,392 బస్సులను నడిపింది.