ఏపీఎస్​ ఆర్టీసీ: సంక్రాంతికి 1000 ప్రత్యేక బస్సులు

By udayam on December 15th / 6:33 am IST

సంక్రాంతి రద్దీకి ఏపీఎస్​ ఆర్టీసి భారీగానే సిద్ధమైంది. ప్రత్యేక బస్సులను వచ్చే నెల 6వ తేదీ నుంచి 18 వరకూ తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరుకు నడపనున్నట్లు తెలిపింది. విజయవాడ నుంచి 1000 ప్రత్యేక బస్సులను పలు ప్రాంతాలకు నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ వెబ్‌సైట్, టికెట్ బుకింగ్ కేంద్రాల ద్వారా స్పెషల్ బస్సులకు టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. తెలంగాణ ఆర్టీసీ కూడా సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే 4,233 ప్రత్యేక బస్సులను ప్రకటించింది. వీటిలో 585 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది.

ట్యాగ్స్​