మెస్సీదే ప్రపంచకప్​.. షూటౌట్లో నెగ్గిన అర్జెంటీనా

By udayam on December 19th / 5:19 am IST

అంచనాలకు అందని ఆట తీరుతో ప్రపంచాన్ని ముగ్దుల్ని చేసిన ఫిఫా వరల్డ్​ కప్​ ఫైనల్లో అర్జెంటీనా జట్టు 36 ఏళ్ళ తర్వాత మరోసారి టైటిల్​ ను అందుకుంది. రెండు కొదమ సింహాలు మైదానంలో కొట్టుకుంటున్నాయా అన్నట్టు సాగిన తుది పోరులో ఫ్రాన్స్​ కీలక ప్లేయర్​ ఎంబపే 56 ఏళ్ళ రికార్డ్​ ను తిరగరాస్తూ ఫైనల్లో హ్యాట్రిక్​ గోల్స్​ చేశాడు. అయినప్పటికీ స్కోర్లు 3–3 తో సమం కావడంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్ ను నిర్వహించారు. దీంట్లో అర్జెంటీనా ఆటగాళ్ళు వరుసగా 4 గోల్స్​ కొడితే.. ఫ్రాన్స్​ మొదటి, 4వ ది మాత్రమే గోల్స్​ చేసి టైటిల్​ ను కోల్పోయింది. అంతకు ముందు అర్జెంటీనా తరపున మెస్సీ 2 గోల్స్​, డి మారియో ఒక గోల్​ కొట్టాడు.

ట్యాగ్స్​