క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండుల్కర్‌కు ఈ సీజన్ అస్సలు కలిసి రావట్లేదు. ఐపిఎల్‌లో రూ.30 లక్షల ధర పలికి ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు ఒక్క మ్యాచ్‌కూ తుది జట్టులో చోటు దక్కించుకోలేక పోయాడు. తాజాగా ముంబై రంజీ ట్రోఫీ జట్టు నుంచి సైతం అతడికి ఉద్వాసన పడింది. జూన్‌లో జరిగనున్న ఈ నాకౌట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా పృధ్వీ షా వ్యవహరించనున్నాడు.