ప్రళయ్ క్షిపణుల కొనుగోలుకు రక్షణ శాఖ నిర్ణయం

By udayam on December 26th / 8:16 am IST

చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యాధునిక క్షిపణులను కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. ఈమేరకు అత్యున్నత స్థాయి సమావేశంలో 120 ప్రళయ్ క్షిపణుల కొనుగోలుకు ఆమోద ముద్ర వేసింది. డీఆర్డీవో సొంతంగా తయారుచేస్తున్న ఈ క్షిపణుల రేంజ్ 100 కి.మీ. నుంచి 500 కి.మీ. వరకు ఉంటుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మన దాయాది దేశాలైన చైనా, పాక్ రెండూ కూడా బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యం కలిగి ఉన్న నేపధ్యంలో ఈ క్షిపణుల కొనుగోలు వ్యవహారం కీలకం కానుంది.

ట్యాగ్స్​