అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిన ఆర్మీ హెలీకాప్టర్

By udayam on October 5th / 9:49 am IST

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా హెలీకాప్టర్ కూలిపోయింది.ఈ ప్రమాదంలో ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ డ్రిల్స్‌లో భాగంగా ఈ చీతా హెలీకాప్టర్ తవాంగ్ ప్రాంతంలో సంచరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని ఆర్మీ వెల్లడించింది. అయితే, ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. హెలీకాప్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్లను సమీపంలోని మిలిటరీ ఆసుపత్రికి తరలించగా, అందులో ఒకరు చికిత్స పొందుతూ మరణించారని ఆర్మీ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్​