కేజ్రీవాల్​: మా ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్​ చేసేయండి

By udayam on June 2nd / 9:56 am IST

మా ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలను ఒకేసారి అరెస్ట్​ చేసేయాలని ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​.. ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘నాకొచ్చిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పుడు ఈడీ మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్​ సిసోడియా వెంట పడుతోంది. నేనిప్పుడు ఈ దేశ ప్రధానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మీ పవర్​ అంతటినీ ఉపయోగించి మా పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి అరెస్ట్​ చేసేయండి. ఇలా ఒకరి తర్వాత ఒకరు వద్దు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​