గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలన్న కోరికతో ఓ కానిస్టేబుల్ విధులకు డుమ్మా కొట్టి దొంగతనాలకు పాల్పడుతూ పట్టుబట్టాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనలో 2010 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ ఈశ్వర్ కు గ్యాంగ్ స్టర్ గా ఎదగాలన్న బలమైన కోరిక ఉందని పోలీసులు చెబుతున్నారు. దీంతో సహచర కానిస్టేబుల్ తో కలిసి అతడు దొంగల ముఠాలను ఏర్పాటు దొంగతనాలు చేయించి వాటాలు పంచుకోవడం మొదలెట్టాడు. ఈ క్రమంలో పంపకాల్లో తేడాల కారణంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ వేర్వేరుగా చిన్న పిల్లలను, మహిళా దొంగలతో ముఠాలు ఏర్పాటు చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. నల్గొండలో ఇటీవల అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు చిన్నారులు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈశ్వర్ బాగోతం బయటపడింది. సోమవారం కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.