పాక్​ ఉగ్రవాదికి భారత్​లో పెళ్ళి

By udayam on October 12th / 9:56 am IST

దేశ రాజధాని ఢిల్లీలో 15 ఏళ్ళుగా ఉంటున్న పాకిస్థాన్​ నుంచి భారత్​కు వచ్చిన ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్​ చేశారు. పాక్​ నుంచి భారత్​ వచ్చే ఉగ్రవాదులకు ఇతడే ఆయుధాలను అందిస్తున్నాడని.. ఈ క్రమంలో భారతీయురాలైన ఓ మహిళను అతడు వివాహం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని లక్ష్మీ నగర్​ సమీపంలో రమేష్​ పార్క్​ వద్ద తప్పుడు ధృవపత్రంతో అలి అహ్మద్​ పూరి పేరట నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. అతడి అసలు పేరు మహ్మద్​ అస్రఫ్​ అని, పాక్​లోని పంజాబ్​ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతడు కాళిందికి సమీపంలోని యమునా నది తీరాన ఇసుక దిబ్బల్లో ఆయుధాలను దాస్తున్నట్లు గుర్తించారు.

ట్యాగ్స్​