భారత ఎన్నికల కమిషనర్‌గా మాజీ ప్రభుత్వ అధికారి అరుణ్ గోయెల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.అరుణ్ గోయల్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గత శుక్రవారమే ఆయన భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పదవి నుంచి వీఆర్‌ఎస్ తీసుకున్నారు. శనివారం, చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ ఆయన్ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది మేలో ఎలక్షన్ కమిషనర్‌గా సుశీల్ చంద్ర పదవీ విరమణ చేసిన తరువాత, రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే ఆ బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు.