అవినీతి చేశాడని ఆరోగ్య శాఖ మంత్రిని భర్తరఫ్ చేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సిఎం భగవంత్ మాన్పై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ‘భగవంత్ను చూసి గర్వపడుతున్నా. ఆయన ఈరోజు చేసిన పని తన కళ్ళలో నీళ్ళు తెప్పించింది. దేశ ప్రజలకు నిజాయితీతో కూడిన పాలన ఇవ్వడంలో మా పార్టీ ఎంతటి క్రమశిక్షణతో ఉంటుందో ఈ చర్యే నిదర్శనం. మా ఒక్క పార్టీయే ఇలాంటి చర్యలు తీసుకోగలదు’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.