ఆర్యన్​కు డ్రగ్స్​ అర్భాజ్​ ఇచ్చేవాడు : ఎన్సీబీ

By udayam on October 14th / 9:50 am IST

షారూక్​ కొడుకు ఆర్యన్​ ఖాన్​ డ్రగ్స్​ కేసులో బెయిల్​ వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్యన్​ లాయర్లు తమ వాదనలు వినిపిస్తూ.. ‘ఎన్సీబీ అధికారులు ఈ దాడులు చేసే క్రమంలో అర్యన్​ ఖాన్​ అసలు షిప్​లో లేడు’ అని వాదించాయి. అయితే దీనిపై సమాధానం ఇచ్చిన ఎన్సీబీ ‘ఆర్యన్​ ఆరోజు షిప్​లోనే ఉన్నాడు. నిజానికి అతడికి డ్రగ్స్​ తెచ్చి ఇచ్చేది అర్భజ్​ ఖాన్​, అతడి స్నేహితులే’ అని పేర్కొంది. అతడేమీ ఇదే తొలిసారిగా డ్రగ్స్​ తీసుకోవట్లేదని, కొన్నేళ్ళుగా మత్తులో తూగుతున్నాడని ఎన్సీబీ కోర్టుకు వెల్లడించింది.

ట్యాగ్స్​