ఆదిపురుష్​: ఆ గ్రాఫిక్స్​తో మాకు సంబంధం లేదు

By udayam on October 4th / 9:30 am IST

ప్రభాస్​ పాన్​ ఇండియా మూవీ ఆదిపురుష్​ టీజర్​లో చూపించిన గ్రాఫిక్స్​ మరీ నాసిరకంగా ఉండడంతో ఫ్యాన్స్​ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి గ్రాఫిక్స్​ వర్క్​ చేసిందంటూ ఎన్​వై విఎఫ్​ఎక్స్​వాలా అనే సంస్థను ట్వీటర్లు ఏకి పారేస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం తాము పనిచేయలేదని ఆ సంస్థ ప్రకటించింది. స్పెషల్​ ఎఫెక్ట్స్​ విషయంలో కానీ, సిజి పనుల్లో కానీ తాము పనిచేయలేదని ఎన్​వై విఎఫ్​ఎక్స్​ ట్వీట్​ చేసింది. అయితే ఈ సంస్థ అజయ్​ దేవగన్​కు చెందినది కావడం విశేషం.

ట్యాగ్స్​