తీవ్ర తుపానుగా అసాని

By udayam on May 9th / 5:00 am IST

దక్షిణ అండమాన్​ సముద్రంలో ఏర్పడ్డ అసాని తుపాను తీవ్ర తుపానుగా ఈరోజు మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎపిలోని ఉత్తరాంధ్ర జిల్లాలపైనా, ఒడిశా, పశ్చిమ బెంగాల్​ ల పైనా దీని ప్రభావం ఉండనుంది. దాని దిశ, వేగాలను బట్టి మంగళవారం నాటికి ఆంధ్ర–ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే రెండు రోజుల్లో ఈ ప్రాంతాల్లోని జిల్లాల వద్ద తీరం దాటనుందని తెలిపింది. ఒడిశాలో వచ్చే 24 గంటల్లో 64.4 మి.మీ. నుంచి 115.5 మి.మీ.ల వర్షపాతం కురవనుందని పేర్కొంది.

ట్యాగ్స్​