AusvsEng: సూపర్​ మ్యాన్​ లా సిక్స్​ ను ఆపిన ఆగర్​

By udayam on November 17th / 12:06 pm IST

ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్​ ఈరోజు ప్రారంభమైంది. ముందుగా ఇంగ్లాండ్​ బ్యాటింగ్​ చేసిన ఈ మ్యాచ్​లో డేవిడ్​ మలన్​ 134 పరుగులతో ఆస్ట్రేలియా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఈ క్రమంలో కమిన్స్​ వేసిన బాల్​ ను సిక్స్​ కొట్టడానికి ప్రయత్నించిన మలన్​ కు.. ఆసీస్​ స్పిన్నర్​ ఆస్టన్​ అగర్​ షాక్​ ఇచ్చాడు. బౌండరీకి దగ్గరగా ఫీల్డింగ్​ కాస్తున్న అతడు ఎడమ చేత్తో బాల్​ ను అందుకుని దానిని అలాగే మైదానంలోకి విసిరేసి బౌండరీ అవతలకి పడిపోయాడు. కేవలం ఒక సెకను లోనే అతడు బౌండరీని కాపాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​ గా మారింది.మొత్తంగా 50 ఓవర్లలో ఇంగ్లాండ్​ 287 పరుగులు చేసింది.

ట్యాగ్స్​