సంగక్కర : అశ్విన్​ చాలా మెరుగవ్వాలి

By udayam on May 30th / 12:19 pm IST

రాజస్థాన్​ రాయల్స్​ టాప్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​పై ఆ జట్టు కోచ్​ సంగక్కర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిన్న గుజరాత్​ టైటాన్స్​తో జరిగిన ఐపిఎల్​ ఫైనల్​ మ్యాచ్​లో ఓటమి అనంతరం మాట్లాడిన సంగక్కర ‘అతడు దిగ్గజ బౌలరే. కాదనలేం. కానీ ఆఫ్​ బ్రేక్​ డెలివరీలను మరింత తెలివిగా, కంటిన్యూగా వేసేలా చూసుకోవాలి. అతడి ప్రదర్శనపై నేనైతే నిరాశ చెందా’ అని కుండ బద్దలుకొట్టాడు. ఈ ఐపిఎల్​లో బ్యాటర్​గా రాణించిన అశ్విన్​.. స్పిన్నర్​గా వెనుకబడ్డాడు.

ట్యాగ్స్​