ఆర్జేడీ నేత: నా పిల్లల్ని విదేశీ పౌరసత్వం తీసుకోమంటున్నా

By udayam on December 23rd / 7:07 am IST

బీహార్ ఆర్‌జెడి పార్టీకి చెందిన నేత అబ్దుల్‌ బారీ సిద్దిఖీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో ముస్లిముల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ‘నేనొక ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నా. నాకు హార్వర్డ్‌లో చదువుతున్న కొడుకు, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుండి డిగ్రీ పొందిన కుమార్తె ఉన్నారు. దేశంలో పరిస్థితులు సరిగా లేవని, అందుకే అక్కడే ఉద్యోగాలు సంపాదించి, వీలైతే ఆ దేశాల పౌరసత్వం తీసుకోవాలని సూచించాను” అని వారికి సూచించాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్​